
హైదరాబాద్, సూర్య న్యూస్ : మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సినిమా విడుదలై 12 రోజులు గడుస్తున్నా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సరికొత్త రీజినల్ రికార్డులను నమోదు చేస్తోంది.
తెలంగాణ ప్రాంతంలో ఈ సినిమా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇక్కడ ఏకంగా రూ.48 కోట్లు కలెక్ట్ చేసి అత్యధిక షేర్ సాధించిన చిత్రంగా నిలిచింది. దీనిద్వారా గతంలో చిరంజీవి నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా పేరిట ఉన్న రూ.47.55 కోట్ల రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటివరకు మొత్తంగా రూ.186.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. అతి త్వరలోనే ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్లో చేరనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



