
హైదరాబాద్, సూర్య న్యూస్ : క్రికెట్ అభిమానులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) శుభవార్త తెలిపింది. మొట్టమొదటి ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Women’s Champions Trophy)కి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2027 ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఈ మెగా టోర్నీ జరగనుందని స్పష్టం చేసింది.
ఆరు జట్లతో టీ20 ఫార్మాట్లో..
ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ట్రోఫీ కోసం తలపడతాయి. ఈ మెగా టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. రౌండ్-రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో, అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్లో తలపడతాయి. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, వడోదరలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌లకు వేదికలుగా నిలవనున్నాయి.
శ్రీలంక నుంచి భారత్‌కు ఆతిథ్య హక్కులు
వాస్తవానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే, శ్రీలంక క్రికెట్ బోర్డు పరిపాలన వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న కారణంతో ఐసీసీ ఆతిథ్య హక్కుల నుంచి శ్రీలంకను తప్పించింది. ప్రత్యామ్నాయంగా బంగ్లాదేశ్, భారత్, దక్షిణాఫ్రికా అభ్యర్థనలను పరిశీలించిన ఐసీసీ.. చివరకు భారత్‌ను సిఫార్సు చేసింది. సెప్టెంబర్ 1న జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయానికి అధికారిక ఆమోదం లభించింది. 2027 మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ.. మహిళల క్రికెట్లో ఒక ఉత్తేజకరమైన కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుందని ఐసీసీ చైర్మన్ జై షా పేర్కొన్నారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



