|  
FLASH NEWS
ISRO EOS-08 : ఇస్రో మరో అద్భుతం.. నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3  •  బండి సంజయ్ : “15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే.. ఇదా దేశభక్తి?”  •  Janmashtami 2026 : కృష్ణాష్టమి పూజ సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి  •  Konda Surekha : మంత్రి కొండా సురేఖ బర్తరఫ్.. అధికారిక ఉత్తర్వులు జారీ!  •  CM Revanth Reddy : “రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్”.. కేబినెట్ నుంచి బర్తరఫ్ వేళ కొండా సురేఖ సంచలనం!  • 
Skip to content

బండి సంజయ్ : “15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే.. ఇదా దేశభక్తి?”

Bandi sanjay
Bandi sanjay

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ సోదరులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమానమైన దేశభక్తులుగా సీఎం రేవంత్ కీర్తించడం పట్ల ఆయన మండిపడ్డారు.

ఒవైసీల గత ప్రసంగాలను ప్రజలు మర్చిపోలేదని బండి సంజయ్ గుర్తుచేశారు. గతంలో అక్బరుద్దీన్ ఒవైసీ.. ‘కేవలం 15 నిమిషాలు పోలీసులను పక్కకు తప్పిస్తే ఏం జరుగుతుందో చూపిస్తాం’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అటువంటి విద్వేషపూరిత ప్రసంగాలు చేయడమే దేశభక్తికి నిదర్శనమా అని సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ఒవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇస్తున్నారని, కానీ తెలంగాణ ప్రజలకు వాస్తవాలు ఏంటో స్పష్టంగా తెలుసు అని బండి సంజయ్ X (ట్విట్టర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఒవైసీల గత ప్రసంగాలను తెలంగాణ సమాజం నిశితంగా గమనించిందని, ఇప్పుడు వారిని దేశభక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp