|  
FLASH NEWS
ISRO EOS-08 : ఇస్రో మరో అద్భుతం.. నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3  •  బండి సంజయ్ : “15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే.. ఇదా దేశభక్తి?”  •  Janmashtami 2026 : కృష్ణాష్టమి పూజ సమయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి  •  Konda Surekha : మంత్రి కొండా సురేఖ బర్తరఫ్.. అధికారిక ఉత్తర్వులు జారీ!  •  CM Revanth Reddy : “రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్”.. కేబినెట్ నుంచి బర్తరఫ్ వేళ కొండా సురేఖ సంచలనం!  • 
Skip to content

CM Thalapathy Vijay : లండన్‌లో భార్య సంగీతతో సీఎం విజయ్ భేటీ? ఫ్యామిలీ రీయూనియన్‌పై ఆసక్తికర చర్చ

london vijay sangeetha family reunion
london vijay sangeetha family reunion

చెన్నై, సూర్య న్యూస్ : తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దళపతి విజయ్ (CM Thalapathy Vijay) తొలిసారిగా విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రానికి భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన ఈ నెల 10వ తేదీన బ్రిటన్ (UK Tour) పర్యటనకు వెళ్లనున్నారు. అయితే ఈ అధికారిక పర్యటనలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనున్నట్లు తమిళనాట రాజకీయ, సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

కుటుంబంతో సీఎం విజయ్ రీయూనియన్?

ముఖ్యమంత్రి విజయ్ తన లండన్ పర్యటనలో భాగంగా అక్కడ నివాసం ఉంటున్న తన భార్య సంగీత, కుమార్తె దివ్యను కలువనున్నారని తెలుస్తోంది. గత కొంతకాలంగా విజయ్, సంగీత దంపతులు దూరంగా ఉంటున్నారనే వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల సంగీత తన విడాకుల కేసును వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. దీంతో వీరిద్దరూ రాజీపడ్డారని, త్వరలోనే అధికారికంగా మళ్లీ ఒక్కటి కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో సీఎం హోదాలో తొలిసారిగా లండన్ వెళ్తున్న విజయ్.. తన కుటుంబాన్ని కలుసుకుని వారితో సమయం గడపనున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకపక్క రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడుల వేట, మరోపక్క కుటుంబంతో మళ్లీ కలవడం దిశగా అడుగులు పడుతుండటంతో విజయ్ బ్రిటన్ పర్యటన అటు రాజకీయంగా, ఇటు వ్యక్తిగతంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp