
ముంబై, సూర్య న్యూస్ : టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), బాలీవుడ్ నటి అమీషా పటేల్ (Ameesha Patel) మధ్య వస్తున్న డేటింగ్ రూమర్స్‌కు ఆ నటి చెక్ పెట్టారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన ఆమె.. తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు.
ఇటీవల ముంబైలో జరిగిన ఓ పార్టీలో హార్దిక్ పాండ్యా భుజంపై అమీషా పటేల్ చేయి వేసి, తన స్నేహితులకు పరిచయం చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో వారిద్దరి క్లోజ్‌నెస్ చూసిన ఓ నెటిజన్.. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనడానికి ఇదే నిదర్శనమంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు.
నెటిజన్ చేసిన ఈ కామెంట్‌పై అమీషా పటేల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ వేదికగా దీటుగా బదులిచ్చారు. “కరెక్టే.. అతడి భుజంపై నేను చేయి వేయడం చాలా రొమాంటిక్‌గా ఉంది. బహుశా నీకు ఫ్రెండ్‌గా అమ్మాయిలెవరూ లేకపోవచ్చు” అంటూ సెటైరికల్‌గా కౌంటర్ ఇచ్చారు. ఒకరి భుజంపై చేయి వేయడాన్ని రొమాంటిక్‌గా చూడటం సరికాదని హితవు పలికిన అమీషా.. తమ మధ్య స్నేహం తప్ప మరేమీ లేదని రూమర్స్‌కు ముగింపు పలికారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



