
గుండ్రాంపల్లిలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
గుండ్రాంపల్లి: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన వీరోచిత తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు చిరస్మరణీయమని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. గుండ్రాంపల్లి గ్రామంలో సెప్టెంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించే తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పార్టీ జెండాను ఆవిష్కరించి వారోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి జోహార్లు పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. నాటి నిరంకుశ పాలనపై ఎర్రజెండా నీడన సాగిన వీరోచిత పోరాటం ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక స్థానం సంపాదించిందని కొనియాడారు. వెట్టిచాకిరీ బంధనాల నుంచి విముక్తి ప్రసాదించిన అమరవీరుల పోరాట పటిమను, స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా బాధ్యులు, పార్టీ గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



