
ఢిల్లీ, సూర్య న్యూస్ : భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగిన తొలి టీ20 (IND vs AFG T20) మ్యాచ్ సరికొత్త చరిత్రకు వేదికైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమ్‌ఇండియా (Team India) ఆటగాళ్లు, మైదానంలోని అభిమానులు తొలిసారిగా జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించారు. జాతీయ గీతం జనగణమన పాడటానికి ముందే వందేమాతరాన్ని పాడటం అంతర్జాతీయ క్రీడా చరిత్రలో ఇదే తొలిసారి.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల జాతీయ గేయానికి సంబంధించి జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు, చట్ట సవరణల నేపథ్యంలో ఈ మార్పు చోటుచేసుకుంది. ఈ నిబంధనల ప్రకారం, నిర్దేశిత అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతానికి ముందే వందేమాతరం పాడాలి. దీన్ని క్రీడా మైదానంలో అమలు చేయడం ఇదే ప్రథమం. పూర్తి ఆరు చరణాలతో కూడిన వందేమాతరాన్ని మైదానంలో దాదాపు మూడు నిమిషాల పది సెకన్ల పాటు ప్లే చేశారు. ఆ వెంటనే 52 సెకన్ల పాటు జనగణమన ఆలపించారు.
అద్భుత విజయంతో సిరీస్‌లో ఆధిక్యం చారిత్రక ఘట్టంతో ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయంతో బోణీ కొట్టింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత్, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆఫ్ఘనిస్థాన్ జట్టును నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులకే పరిమితం చేసింది. అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో ఓపెనర్ అభిషేక్ శర్మ (82), ఇషాన్ కిషన్ (42) వీరవిహారం చేయడంతో కేవలం 13.4 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



