
న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సభ్యుల కోసం సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. పీఎఫ్ ఖాతాదారులకు మరింత చేరువయ్యేందుకు తాజాగా వాట్సాప్ ఛానల్ (WhatsApp Channel) ప్రారంభించింది. ఈ ఛానల్ ద్వారా పీఎఫ్ స్కీమ్స్, ముఖ్యమైన అప్‌డేట్స్, ఇతర కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది.
ఖాతాదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి అప్‌డేట్స్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ సెర్చ్ బార్‌లో ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి వెతికితే అధికారిక ఛానల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కడం ద్వారా ఈ ఛానల్‌లో సులభంగా చేరవచ్చు. దీని ద్వారా ఎప్పటికప్పుడు సంస్థ నుంచి వచ్చే ప్రకటనలను నేరుగా మెసేజ్‌ల రూపంలో పొందవచ్చు.
సమాచారం కోసం మాత్రమే ఈ సేవలు
అయితే ఈ వాట్సాప్ ఛానల్ కేవలం సమాచారం అందించేందుకు మాత్రమే పరిమితం అని అధికారులు స్పష్టం చేశారు. ఖాతాదారులు తమ పీఎఫ్ క్లెయిమ్స్ చేసుకోవడానికి పాత పద్ధతినే అనుసరించాలి. అలాగే పాస్‌బుక్ వివరాలు చూసుకోవడానికి లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ ఉపయోగించాలి. ఈ సేవలన్నీ మునుపటి లాగానే ఉమంగ్ యాప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



