|  
FLASH NEWS
​Nestle India : నెస్లే పిల్లల ఉత్పత్తులపై FSSAI కొరడా.. ఆ రెండు బ్రాండ్లపై కఠిన చర్యలకు సిద్ధం  •  Ramayana Movie : ‘రామాయణ’ ఇంగ్లీష్ వెర్షన్‌లో భారీ మార్పులు.. ఆ సీన్లు, పాటలు కట్?  •  Election Commission : టీఎంసీలో వర్గపోరు.. మమత, రెబెల్ గ్రూపులకు కొత్త పేర్లు, గుర్తులు కేటాయించిన ఈసీ  •  Zombie Reddy 2 : జాంబీ ప్రపంచంలోకి రియల్ స్టార్ ఎంట్రీ.. పవర్‌ఫుల్ వారియర్ లుక్‌లో ఉపేంద్ర  •  IND vs AFG 3rd T20 : ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. సిరీస్ క్లీన్ స్వీప్  • 
Skip to content

Rohit Sharma : ‘మైదానంలో మంచి ఆటగాడే కానీ బెడ్ పై కాదు’.. రోహిత్ పరువు తీసిన ప్రముఖ నటి

​ముంబై, సూర్య న్యూస్ :​ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పరువు తీసేలా ఆయన మాజీ ప్రియురాలు, ప్రముఖ మోడల్ సోఫియా హయత్ (Sofia Hayat) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో రోహిత్ వ్యక్తిగత జీవితంపై దారుణమైన కామెంట్స్ చేశారు.

2012 సమయంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ అప్పట్లో తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. ఆ వ్యవహారంపై రోహిత్ ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. తాజాగా సోఫియా తన ఇంటర్వ్యూలో ఆనాటి పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తనకు క్రికెట్ గురించి ఏమీ తెలియదని తన మేనేజర్ ద్వారానే ఆయనతో పరిచయం ఏర్పడిందని ఆమె వెల్లడించారు. రోహిత్ మైదానంలో అద్భుతమైన ఆటగాడు అయినప్పటికీ పడకగదిలో మాత్రం తనను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కొంతకాలం డేటింగ్ తర్వాత పలు విభేదాల కారణంగా తాము విడిపోయినట్లు సోఫియా తెలిపారు. ఈ ఇంటర్వ్యూ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రోహిత్ జీవితంలో తానే తొలి మహిళను అని ఆమె పేర్కొన్నారు. ప్రైవేట్ జీవితంలో మహిళల మనోభావాలను ఎలా గౌరవించాలో పురుషులకు ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం ఉందని ఆమె పోస్ట్ చేశారు. దశాబ్దానికి పైగా గడిచిపోయిన పాత విషయాలను ఇప్పుడు బహిర్గతం చేయడంపై క్రీడాభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేవలం తన పాడ్‌కాస్ట్ పబ్లిసిటీ కోసమే సోఫియా ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందంటూ నెట్టింట ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp