|   
🔴 BREAKING NEWS ► TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే Teenmar Mallanna : తెలంగాణలో రెడ్ల విగ్రహాలు కూలగొడతాం.. రాబోయేది బీసీల రాజ్యమే అంటున్న తీన్మార్ మల్లన్న? Rega Kantha Rao Arrest : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. లైంగిక ఆరోపణల కేసులో పోలీసుల అదుపులో Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టు స్టే.. అసలు కారణం ఇదే
Skip to content

Puri Jagannadh Charmme : పూరీ జగన్నాథ్ కెరీర్ నాశనానికి ఆమే కారణం.. భార్యాపిల్లల గురించి సంచలన వ్యాఖ్యలు

Hyderabad, Surya News:టాలీవుడ్ (Tollywood) డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) కెరీర్ గురించి బాలీవుడ్ (Bollywood) నటులు అజాజ్ ఖాన్ (Ajaz Khan), షావర్ అలీ (Shawar Ali) సంచలన విషయాలు వెల్లడించారు. ఒక ఇంటర్వ్యూలో పూరీ వ్యక్తిగత జీవితం, చార్మీ కౌర్ (Charmme Kaur) తో ఆయనకున్న రిలేషన్ పై వాళ్ళు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

​స్టార్ హీరోల నుంచి జీరో స్థాయికి

గతంలో పూరీ జగన్నాథ్ ఫ్లాప్ సినిమాలు తీసినా మంచి ఫాలోయింగ్ ఉండేది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఎన్టీఆర్ (NTR), మహేష్ బాబు (Mahesh Babu), ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి ఎదురుచూసేవారు. కానీ లైగర్ (Liger), డబుల్ ఇస్మార్ట్ (Double iSmart) సినిమాల తర్వాత తెలుగు హీరోలు ఎవరూ ఆయనతో సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. పూరీ కెరీర్ ను జ్యోతిలక్ష్మి (Jyothi Lakshmi) సినిమాకు ముందు, ఆ తర్వాత అని రెండు భాగాలుగా చూడాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. పూరీ జగన్నాథ్ ఇంట్లో కూర్చుంటే ఒకప్పుడు కేవలం సినిమాల గురించే మాట్లాడుకునే వారని, కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా మారిపోయారని షావర్ అలీ అన్నారు.

చార్మీ ఎంట్రీతోనే మొత్తం నాశనం

పూరీ జీవితంలోకి చార్మీ (Charmme) వచ్చిన తర్వాతే మొత్తం మారిపోయిందని అజాజ్ ఖాన్ ఆరోపించారు. చార్మీ బయటనుంచి వచ్చి అంతా నాశనం చేసిందని, ఇప్పుడు పూరీని ఆమే కంట్రోల్ చేస్తోందని ఆయన విమర్శించారు. సౌత్ జనాలు సంస్కృతిని, ఆచారాలను గౌరవిస్తారని, కానీ పూరీ జగన్నాథ్ తన భార్యను, పిల్లలను వదిలేశాడని అజాజ్ ఖాన్ అన్నారు. భార్యాపిల్లలను వదిలేసిన వాడిని సౌత్ జనాలు జీరో కింద లెక్కకడతారని, అందుకే హీరోలు ఆయనతో సినిమాలు చేయడం మానేశారని ఆయన కుండబద్దలు కొట్టారు. పూరీ మంచివాడని, అయితే ఆయన కెరీర్ నాశనం అవ్వడానికి చార్మీనే కారణమని ఆయన స్పష్టం చేశారు.

పూరీ, చార్మీ పెళ్లి చేసుకున్నారా?

పూరీ జగన్నాథ్ ఇప్పుడు పాత స్నేహితులైన సోనూ సూద్ (Sonu Sood), సుబ్బరాజు (Subbaraju) లాంటి వాళ్లతో కూడా మాట్లాడటం లేదని అజాజ్ ఖాన్ తెలిపారు. చార్మీ అందరినీ ఆయనకు దూరం చేసిందని, తన నెంబర్ కూడా బ్లాక్ చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పూరీ, చార్మీ పెళ్లి చేసుకున్నట్టు ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పూరీ సార్ ఎప్పుడు రిటర్న్ వస్తాడా అని తాము ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అజాజ్ ఖాన్ గతంలో హార్ట్ ఎటాక్, టెంపర్, రోగ్ సినిమాల్లో నటించగా, షావర్ అలీ గోలీమార్, ఇద్దరమ్మాయిలతో లాంటి సినిమాల్లో నటించారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp