|  
● FLASH NEWS
Hyderabad : తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా సురేష్ గౌడ్ నియామకం  •  Supreme Court : దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్..  •  NHRC Case on TG Hospitals : సర్కారు దవాఖానాల దుస్థితిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీలో కేసు.. అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఫిర్యాదు  •  PM Modi Chintan Baithak : ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు, రేపు ‘చింతన్ బైఠక్’.. అజెండా ఇదే!  •  ‘చనిపోయేందుకు విషం ఇవ్వండి’.. కోర్టులో కన్నీరుమున్నీరైన నటి  • 
Skip to content

Liquor: ఏపీలో 807 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్

అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాల (Liquor Shops) కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ (Excise Department) తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోయిన మొత్తం 807 వైన్ షాపులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.

రెన్యూవల్ కానివి కలుపుకుని..

రాష్ట్రంలో మొత్తం 3,650 మద్యం దుకాణాల రెన్యూవల్ కోసం ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తుల గడువు ముగిసే సమయానికి వాటిలో 414 షాపులు మినహా మిగిలినవన్నీ రెన్యూవల్ అయ్యాయి. దీంతో రెన్యూవల్ కాని ఈ 414 దుకాణాలతో పాటు, గతంలో కేటాయింపు జరగకుండా మిగిలిపోయిన షాపులను కూడా కలుపుకుని మొత్తం 807 దుకాణాలకు అధికారులు ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశారు.

దరఖాస్తు ఫీజు, గడువు వివరాలు

ఈ మద్యం దుకాణాలను దక్కించుకోవాలనుకునే వ్యాపారులు అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. దరఖాస్తుదారులు నాన్-రిఫండబుల్ ఫీజు కింద రూ.3 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1,000 చెల్లించి అప్లై చేసుకోవాలని స్పష్టం చేసింది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp