|  
● FLASH NEWS
EVMs: పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం : కల్వకుంట్ల కవిత  •  Housing: ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన  •  Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్  •  INDvsWI: సిరీస్ విండీస్ వశం.. కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు  •  Cinema : ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అస్తమయం  • 
Skip to content

EVMs: పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం : కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, సూర్య న్యూస్ : దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను రద్దు చేసి, తిరిగి పేపర్ బ్యాలెట్ (Paper Ballot) విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తామని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈవీఎంలను సులభంగా మ్యానుపులేట్ చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లోపాల వల్లే అమెరికా లాంటి అత్యంత అభివృద్ధి చెందిన దేశాలు సైతం తిరిగి బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ఆమె గుర్తుచేశారు.

ఇదే క్రమంలో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఆమె మరో కీలక ప్రకటన చేశారు. త్వరలో జరగనున్న ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో తమ పార్టీ అభ్యర్థి కూడా పోటీలో ఉంటారని కవిత వెల్లడించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp