
సూర్య న్యూస్ డెస్క్ : ఫ్లైదుబాయ్ (Flydubai) విమానం ఘటనలో నిందితుడైన కో-పైలట్ హమామ్ అల్-హమ్మూమీ (29) విచారణలో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. విమానాన్ని ఉద్దేశపూర్వకంగానే కూల్చాలని తాను ప్రణాళిక రచించినట్లు అతడు సౌదీ అధికారుల విచారణలో అంగీకరించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ సహా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.
కెప్టెన్‌ను చంపేసి కూల్చాలని స్కెచ్
ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్టులో ఈ విమానాన్ని కూల్చాలనేది హమామ్ ప్రధాన ప్లాన్‌గా తెలుస్తోంది. విమానం ల్యాండింగ్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాత కెప్టెన్‌ను హతమార్చి, తన కంట్రోల్‌లోకి తీసుకుని ఎయిర్‌పోర్టులోని భవనాలు లేదా జెట్‌వేలపై విమానాన్ని క్రాష్ చేయాలని ప్లాన్ చేశాడు. అయితే, ఆ సమయంలో విమానంలో తనకు తెలిసిన ఫ్రెండ్స్ క్రూ మెంబర్లుగా ఉండటంతో తన ప్లాన్‌ను విరమించుకున్నట్లు అతడు తెలిపాడు. జూలై నెలలో కూడా అచ్చం ఇలాగే విమానం కూల్చేందుకు ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తనకు చావు అంటే భయం లేదని, విమానం కూల్చాలనేదే తన ఏకైక ప్లాన్ అని అతడు అధికారులతో చెప్పినట్లు సమాచారం.
అతడి వెనుక ఉన్నదెవరు?
సౌదీ అరేబియా అధికారుల విచారణలో అతడు ఒంటరిగానే ఈ ప్రణాళిక రచించాడా లేక అతడి వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో యూఏఈ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హమామ్ తండ్రి ఒమన్ దేశస్థుడు కాగా, తల్లి సిరియాకు చెందిన మహిళ అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గతంలో ఎయిర్ ఒమన్‌లో కో-పైలట్‌గా పనిచేస్తున్న సమయంలోనే అతడి వద్ద తీవ్రవాద సామాగ్రి దొరికినట్లు వెల్లడించింది.
మహిళలంటే తీవ్ర ద్వేషం
హమామ్ తీవ్రమైన మత విశ్వాసాలు కలిగి ఉండటమే కాకుండా స్త్రీ ద్వేషి అని దర్యాప్తులో తేలింది. ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో అతడు డిలీట్ చేసిన దాదాపు 3 వేలకు పైగా స్క్రీన్‌షాట్లను అధికారులు రికవరీ చేశారు. అతడు స్త్రీ వ్యతిరేకి అని అందులో తేలినట్లు పేర్కొన్నారు. హమామ్ పేరుతో ఉన్న సోషల్ మీడియా ప్రొఫైల్స్ ప్రస్తుతానికి తొలగించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



