
ముంబై, సూర్య న్యూస్ : పనోరమా స్టూడియోస్ ఆస్తులతో పాటు తన కుటుంబ సభ్యుల ఇళ్లపై జరిగిన ఆదాయపు పన్ను శాఖ (IT) దాడుల అంశంపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తొలిసారిగా స్పందించారు. ఈ వ్యవహారంలో తన పేరును ప్రస్తావించడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సోదాలతో సంబంధం లేదు
ఇటీవల ముంబైలోని 12 ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో రకుల్ ప్రీత్ సింగ్ మామ, ప్రముఖ నిర్మాత వాసు భగ్నానీకి చెందిన ఆస్తులను సైతం అధికారులు పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన రకుల్.. ఆ సోదాలు తనకు సంబంధించినవి కావని స్పష్టం చేశారు. తాను కష్టపడి పైకి వచ్చానని, 20 ఏళ్ల వయసు నుంచే క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.
అక్రమ చెల్లింపులు చేయలేదు
సినిమా నిర్మాణ కార్యకలాపాల ద్వారా పన్ను ఎగవేతకు పాల్పడ్డారని, మూవీ ప్రొడక్షన్ పేరుతో పెద్ద మొత్తంలో నిధులను విదేశాలకు తరలిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఐటీ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ ఆరోపణల గురించి రకుల్ మాట్లాడుతూ.. “వ్యక్తిగతంగా లేదా నిర్మాణ సంస్థ ద్వారా నేను ఎలాంటి అక్రమ విదేశీ చెల్లింపుల్లో ఇన్వాల్వ్ కాలేదు. నాకు ఎలాంటి బినామీ ఆస్తులు లేవు. ఎవరూ నాకు ప్రాపర్టీలు గిఫ్ట్‌గా ఇవ్వలేదు.. అలాంటివి నేను స్వీకరించను కూడా” అని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



