|  
● FLASH NEWS
Shreyas: విండీస్‌పై భారత్ ఘన విజయం.. శతకంతో చెలరేగిన అయ్యర్  •  బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్.. గాంధీ ఆస్పత్రికి తరలింపు  •  Cricket: కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు  •  ACB Raids: ఏసీబీ వలలో ఇద్దరు కీలక మహిళా అధికారులు  •  RakulPreet: ఐటీ దాడులపై ఘాటుగా స్పందించిన రకుల్  • 
Skip to content

BRAOU: రేపు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ 27వ స్నాతకోత్సవం

హైదరాబాద్, సూర్య న్యూస్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) 27వ స్నాతకోత్సవం బుధవారం (అక్టోబర్ 7) అట్టహాసంగా జరగనుంది. జూబ్లీహిల్స్‌లోని యూనివర్సిటీ క్యాంపస్ భవనం వెంకట్రామ్ ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని (Convocation) నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్నాతకోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

గౌరవ డాక్టరేట్ అందుకోనున్న బి. నరసింగరావు

ఈ కార్యక్రమానికి వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షత వహించనుండగా, న్యాక్ మాజీ డైరెక్టర్, ఓపెన్ వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వి.ఎస్. ప్రసాద్ స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నిర్మాత, రచయిత, నటుడు బి. నరసింగరావుకు విశ్వవిద్యాలయం తరఫున గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. గవర్నర్ చేతుల మీదుగా విద్యార్థులకు ఎంఫిల్, పీహెచ్‌డీ పట్టాలతో పాటు బంగారు పతకాలు, బుక్ ప్రైజ్‌లు అందజేయనున్నారు.

36 వేల మందికి డిగ్రీలు.. ఖైదీలకూ పట్టాలు

ఈ 27వ స్నాతకోత్సవంలో మొత్తం 36,145 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో పట్టాలు ప్రదానం చేయనున్నారు. అలాగే 38 మందికి బంగారు పతకాలు, 23 మంది పరిశోధక విద్యార్థులకు పీహెచ్‌డీ, ఒకరికి ఎంఫిల్ డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు విద్యావకాశాలు కల్పించాలనే లక్ష్యంలో భాగంగా.. చర్లపల్లి, రాజమండ్రి, కడప సెంట్రల్ జైళ్లకు చెందిన 27 మంది ఖైదీలకు (26 మంది పురుషులు, ఒక మహిళ) సైతం ఈ కార్యక్రమంలో డిగ్రీలు అందజేయనున్నారు.

విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం

స్నాతకోత్సవానికి హాజరయ్యే ప్రభుత్వ అధికారులు, వివిధ వర్సిటీల వైస్ ఛాన్సలర్లు, విద్యార్థులు, ఆహ్వానితులు ఉదయం 10.30 గంటల కల్లా తమ సీట్లలో ఆసీనులు కావాలని రిజిస్ట్రార్ సూచించారు. ఈ కార్యక్రమానికి వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి మెట్రో స్టేషన్లతో పాటు జర్నలిస్ట్ కాలనీ బస్ స్టాప్ నుంచి యూనివర్సిటీ క్యాంపస్ వరకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp