|  
● FLASH NEWS
Shreyas: విండీస్‌పై భారత్ ఘన విజయం.. శతకంతో చెలరేగిన అయ్యర్  •  బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్.. గాంధీ ఆస్పత్రికి తరలింపు  •  Cricket: కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ వీడ్కోలు  •  ACB Raids: ఏసీబీ వలలో ఇద్దరు కీలక మహిళా అధికారులు  •  RakulPreet: ఐటీ దాడులపై ఘాటుగా స్పందించిన రకుల్  • 
Skip to content

Modi: మోదీది విష్ణు అవతారం.. ప్రధానిపై భూటాన్ పీఎం ప్రశంసలు

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై (PM Modi) భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే (Bhutan PM) ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019 సంవత్సరంలో మోదీని కలిసినప్పుడు ఆయనలో తనకు ‘విష్ణు అవతారం’ కనిపించిందని అప్పట్లో చెప్పిన విషయాన్ని భూటాన్ పీఎం తాజాగా మరోసారి గుర్తుచేసుకున్నారు.

విజన్ ఉన్న నాయకుడు

ఆ తర్వాత మోదీని అలా ఎందుకు అన్నానా అని తాను ఆలోచించానని, కానీ ఆ మాట నూటికి నూరు శాతం సరైందేనని తనకు అనిపించిందని షెరింగ్ టోబ్గే పేర్కొన్నారు. ఒక ముఖ్యమంత్రిగా గుజరాత్ రాష్ట్రాన్ని మోదీ ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లారని, ఇప్పుడు అవే ఆలోచనలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఆయన విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు.

కాగా, నరేంద్ర మోదీ తొలిసారిగా 2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘకాలం ఆ రాష్ట్ర సీఎం‌గా పనిచేసిన అనంతరం 2014లో దేశ ప్రధానమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించి, ప్రస్తుతం వరుసగా మూడోసారి ప్రధానిగా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పాలనాపరమైన ప్రజా జీవితంలోకి వచ్చి 25 వసంతాలు పూర్తి చేసుకోవడంతో దేశ విదేశీ ప్రముఖుల నుంచి ఆయనకు విశేషంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp