|  
● FLASH NEWS
Judge: 5 నెలల్లో 23 మందికి ఉరిశిక్షలు.. సంచలన జడ్జి బదిలీ  •  Gouds: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుల నియామకం  •  BRAOU: మలేషియా సదస్సులో అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ఆన్‌లైన్ కోర్సులపై చర్చ  •  Diplomacy: జైశంకర్ దౌత్య వ్యూహం.. యూఎస్ విదేశాంగ మంత్రి ముందే పాక్ గుట్టు రట్టు  •  SupremeCourt: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల గడువుపై కీలక ఆదేశాలు  • 
Skip to content

NHM Strike: ఎన్‌హెచ్ఎం ఉద్యోగుల సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు

హైదరాబాద్, సూర్య న్యూస్ : గత 14 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ (NHM Strike) ఉద్యోగులకు బీఆర్ఎస్ (BRS) పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వయంగా వెళ్లి సంఘీభావం తెలిపారు.

రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందించిన సిబ్బంది నేడు రోడ్డున పడటం అత్యంత బాధాకరమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వీరికి వేతనాలు పెంచి ఆదుకుంటే, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీస ప్రసూతి సెలవులు, ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

ప్రభుత్వ పెద్దల లగ్జరీ ఖర్చులకు నిధులు కేటాయిస్తున్న రాష్ట్ర సర్కార్, ఎన్‌హెచ్ఎం ఉద్యోగుల భీమా ప్రీమియం చెల్లించడానికి ఎందుకు వెనుకడుగు వేస్తోందని ఆయన నిలదీశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండి పోరాడుతుందని ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp