|  
● FLASH NEWS
Ebola: ప్రపంచానికి ఎబోలా ముప్పు.. రెడ్ అలర్ట్‌లో యూరప్!  •  OmarAbdullah: జమ్మూకశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!  •  Iran: మళ్లీ దాడికి దిగితే అమెరికాకు ఓటమి తప్పదు: ఇరాన్  •  YSRCP: కూటమి పాలనలో ధరల మంట.. బాదుడే బాదుడన్న జగన్  •  TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. నవంబర్‌లో 1,395 ఉద్యోగాలకు నోటిఫికేషన్!  • 
Skip to content

Iran: మళ్లీ దాడికి దిగితే అమెరికాకు ఓటమి తప్పదు: ఇరాన్

సూర్య న్యూస్ డెస్క్: ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాము మునుపెన్నడూ లేనంతగా యుద్ధానికి సన్నద్ధమయ్యామని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఫ్ఘ్ స్పష్టం చేశారు.

శాంతి చర్చల కోసం జేడీ వాన్స్ లేఖ రాయడాన్ని అమెరికా తీసుకున్న సానుకూల చర్యగా ఆయన పేర్కొన్నారు. అయితే, అమెరికా మరోసారి తమపై దాడికి దిగితే మాత్రం వారికి ఓటమి తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఖతర్ మధ్యవర్తిత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, తమ షరతులకు అమెరికా అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని అరాఫ్ఘ్ వెల్లడించారు.

శత్రువులు దాడికి దిగితే తక్షణం మరియు బలంగా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉండాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తమ సాయుధ దళాలను ఆదేశించారు. ఎలాంటి భౌగోళిక పరిమితులు లేకుండా విరుచుకుపడాలని ఆయన స్పష్టం చేశారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఆస్తులన్నింటినీ టార్గెట్ లిస్టులో చేర్చాలని, వాటిని దాడి పరిధిలోకి తీసుకురావాలని ఖమేనీ సూచించారు. అమెరికా మరోసారి దాడి చేయవచ్చనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp