|  
● FLASH NEWS
Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి  •  Para Games: మీ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.. అథ్లెట్లతో మోదీ  •  Weather: రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్  •  YS Jagan: ఏపీని సౌత్ బిహార్‌లా మార్చేశారు.. చంద్రబాబు గెలిచినా ఓడినట్లే  •  ఎమ్మెల్యే వేముల వీరేశంకు తప్పిన పెను ప్రమాదం.. ధ్వంసమైన కారు  • 
Skip to content

Voters: తెలంగాణ పట్టభద్రులకు గుడ్‌న్యూస్.. ఓటరు నమోదు గడువు పెంపు

పట్టభద్రుల ఓటరు నమోదు గడువు పెంపు

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణలో (Telangana) జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల (Graduate MLC Elections) ఓటరు నమోదు గడువును పెంచుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (CEO) సి. సుదర్శన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో, నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు పట్టభద్రులు తమ పేర్లను ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

సాంకేతిక లోపాలతో మొరాయిస్తున్న పోర్టల్

గత రెండు రోజులుగా ఓటరు నమోదు పోర్టల్ సాంకేతిక సమస్యలతో మొరాయిస్తుండటంతో, ఫామ్-18 ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న అర్హులైన పట్టభద్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితిపై స్పందించిన సీఈఓ సుదర్శన్‌రెడ్డి.. దరఖాస్తు గడువుపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలను ఐటీ బృందాలు వేగంగా పరిష్కరిస్తున్నాయని, దరఖాస్తు సేవలను వెంటనే పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు, కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఆ ప్రకటన వెలువడి, నామినేషన్ల ఘట్టం ముగిసే వరకు ఓటరు నమోదు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని సీఈఓ వెల్లడించారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp