రిపోర్టర్: Venkat Reddy

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ డెస్క్ :
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న శాటిలైట్ కమ్యూనికేషన్ (Satellite Communication) మార్కెట్‌లో పారదర్శకమైన పోటీకి అన్ని సంస్థలకూ సమాన అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ రంగంలో సేవలు అందించేందుకు జియో, వన్‌వెబ్, ఎలోన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సహా అన్ని ప్రముఖ కంపెనీలను ప్రభుత్వం ఆహ్వానిస్తోందని అధికారులు స్పష్టం చేశారు.
అయితే, అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడం, ప్రభుత్వ నిబంధనల అమలుకు సంబంధించిన అవసరమైన వివరాలను సమర్పించడంలో స్టార్‌లింక్ సంస్థ అన్నింటికంటే చివరన నిలిచిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నిబంధనలకు అనుగుణంగా సరైన సమయంలో వివరాలు అందించడంలో స్టార్‌లింక్ విఫలమైందని స్పష్టం చేశారు. శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని, పారదర్శకంగానే అనుమతుల ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు పునరుద్ఘాటించారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



