|  
● FLASH NEWS
Pollution: దీపావళి ముందే ఢిల్లీలో గాలి నాణ్యత విషమం.. GRAP-III అమలు  •  Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి  •  Para Games: మీ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.. అథ్లెట్లతో మోదీ  •  Weather: రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్  •  YS Jagan: ఏపీని సౌత్ బిహార్‌లా మార్చేశారు.. చంద్రబాబు గెలిచినా ఓడినట్లే  • 
Skip to content

Scam: పేటీఎం దీపావళి ఆఫర్ పేరుతో వాట్సాప్ లింకులు.. సజ్జనార్ సీరియస్ వార్నింగ్

రిపోర్టర్: Surya News

హైదరాబాద్, సూర్య న్యూస్ : పేటీఎం (Paytm) దీపావళి కానుకగా రూ.1,000 ఇస్తోందని, వెంటనే క్లెయిమ్ చేసుకోండంటూ వాట్సాప్‌లో విపరీతంగా వైరల్ అవుతున్న మెసేజ్‌లను నమ్మొద్దని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్రంగా హెచ్చరించారు. పండుగ కానుకల పేరుతో సైబర్ నేరగాళ్లు పంపుతున్న ఫేక్ లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

​నమ్మిస్తే.. ఖాతాలు ఖాళీయే!

​'నేను ఫేక్ అనుకున్నా.. కానీ నిజంగానే రూ.1,000 వచ్చాయి. మీరూ ట్రై చేయండి' అంటూ అత్యంత సహజంగా నమ్మించేలా సైబర్ కేటుగాళ్లు ఈ మెసేజ్‌లను రూపొందిస్తున్నారని సజ్జనార్ వివరించారు. ఆశపడి అలాంటి గుర్తుతెలియని లింకులపై క్లిక్ చేస్తే, ఫోన్‌లోని మన వ్యక్తిగత వివరాలన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తాయని స్పష్టం చేశారు. తద్వారా క్షణాల్లో బ్యాంక్ ఖాతాల్లోని డబ్బు మొత్తం ఖాళీ అవుతుందని ఆయన ప్రజలను హెచ్చరించారు. ఇలాంటి ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని కోరారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp