|  
● FLASH NEWS
Pollution: దీపావళి ముందే ఢిల్లీలో గాలి నాణ్యత విషమం.. GRAP-III అమలు  •  Tirupati: చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తా: ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డి  •  Para Games: మీ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.. అథ్లెట్లతో మోదీ  •  Weather: రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు.. విపత్తు నిర్వహణ సంస్థ అలర్ట్  •  YS Jagan: ఏపీని సౌత్ బిహార్‌లా మార్చేశారు.. చంద్రబాబు గెలిచినా ఓడినట్లే  • 
Skip to content

SIR: ఏడు రాష్ట్రాల్లో తొలగిన ఓటర్లకు మరో అవకాశం

ఢిల్లీ, సూర్య న్యూస్ : ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా నుంచి తొలగించబడిన ఓటర్లకు భారత ఎన్నికల సంఘం (Election Commission of India) మరో అవకాశం కల్పించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, నాగాలాండ్‌లలో అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ (ASDD) కేటగిరీలో గుర్తించి తొలగించిన వారికి ఎన్యూమరేషన్ ఫారమ్‌లు మళ్లీ సమర్పించే అవకాశం ఇచ్చింది.

శుక్రవారం సంఘం ఆయా రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్యూమరేషన్ ఫారమ్‌లు ఇచ్చినప్పటికీ అవి తిరిగి రాకపోవడంతో డ్రాఫ్ట్ జాబితాలో చేరని ఓటర్లకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. వీరు ఫారం-6 దాఖలు చేయాల్సిన అవసరం లేదు. పాత ఎపిక్ నంబర్‌తోనే తిరిగి చేరవచ్చు.

బూత్‌వారీగా అటువంటి ఓటర్ల జాబితాలను పోలింగ్ స్టేషన్ల నోటీసు బోర్డులు, పంచాయతీ భవనాలు, పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల్లో మళ్లీ ప్రదర్శించాలని ఆదేశించింది. జాబితాల్లో తొలగింపు సంభావ్య కారణాలు కూడా పేర్కొనాలి. ఈ జాబితాలను సీఈవో వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ రూపంలో అప్‌లోడ్ చేయాలి.

బూత్ లెవల్ అధికారులు (BLO) ఇళ్లకు వెళ్లి, పొరుగువారి ద్వారా, వాట్సాప్, ఈమెయిల్, ఎస్‌ఎంఎస్ ద్వారా సంబంధిత ఓటర్లను సంప్రదించి ఫారమ్‌లు అందజేయాలి. నివాసం మారని వారు ఎందుకు ముందు సమర్పించలేదో చెప్పే స్టేట్‌మెంట్‌తో పాటు ఫారమ్ దాఖలు చేయవచ్చు. రాష్ట్రంలోనే నివాసం మారినవారు కొత్త చిరునామా, అసెంబ్లీ నియోజకవర్గం పేర్కొని సమర్పించాలి. ఇప్పటికే ఫారం-6 దాఖలు చేసినవారు మళ్లీ ఎన్యూమరేషన్ ఫారమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు.

తెలంగాణలో డ్రాఫ్ట్ జాబితాలో దాదాపు 73.39 లక్షల మందిని ASDD కేటగిరీలో గుర్తించి తొలగించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా లక్షలాది మంది ఓటర్లు డ్రాఫ్ట్ నుంచి మినహాయించబడ్డారు. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు పరిశీలనల నేపథ్యంలో వచ్చింది. డ్రాఫ్ట్ నుంచి తొలగించిన వారిని ఫారం-6 ద్వారా మళ్లీ చేర్చమన్న విధానంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

అర్హత కలిగిన ఓటర్లు ఎవరూ తుది జాబితాలో చేరకుండా పోకుండా చూసేందుకు పర్యవేక్షణ విధానం ఏర్పాటు చేయాలని, డూప్లికేట్ నమోదులు జరగకుండా చూడాలని సంఘం స్పష్టం చేసింది. తెలంగాణలో ఈ ప్రక్రియ నవంబర్ 21 నాటికి పూర్తి చేయాలని సీఈవో కార్యాలయం సూచించింది. సంబంధిత ఓటర్లు BLOలను సంప్రదించి లేదా 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సహాయం తీసుకోవచ్చు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp