|  
● FLASH NEWS
HMT: హెచ్‌ఎంటీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు మద్దతు.. కేంద్రంపై ఎమ్మెల్యే వివేకానంద్ ఫైర్  •  Supreme: వారసత్వ ఆస్తిలో మనవడికి హక్కు ఉండదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు  •  Rice: కాంగ్రెస్ పాలనలో బియ్యం ధరల మంట.. బీఆర్ఎస్ నేత ఆగ్రహం  •  MEIL: వాటర్ సప్లై ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు.. ఆంధ్రాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు  •  Jobs: కేంద్ర అణుశక్తి శాఖలో 254 టీచర్ ఉద్యోగాలు.. భారీ వేతనంతో  • 
Skip to content

ONGC: ఓఎన్జీసీలో భారీగా ఉద్యోగాలు.. అర్హతలు, లాస్ట్ డేట్ వివరాలివే!

3,047 అప్రెంటిస్ శిక్షణా పోస్టులు.. లాస్ట్ డేట్ 20 నవంబర్ 2026

న్యూఢిల్లీ, సూర్య న్యూస్ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో నిరుద్యోగులకు అదిరిపోయే అవకాశం లభించింది. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3,047 అప్రెంటిస్ (Apprentice) శిక్షణా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇవి అప్రెంటిసెస్ చట్టం, 1961 కింద శిక్షణా పోస్టులే తప్ప రెగ్యులర్ ఉద్యోగాలు కావు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సంస్థ ఒక ప్రకటనలో సూచించింది.

అర్హత, స్టైపెండ్

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి, ఐటీఐ (ITI), డిప్లొమా లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కొన్ని ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు 12వ తరగతి అర్హత కూడా వర్తిస్తుంది. 29 నవంబర్ 2026 నాటికి అభ్యర్థి వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. శిక్షణా కాలం 12 నెలలు. దేశవ్యాప్తంగా 24 వర్క్ సెంటర్లలో ఈ అవకాశాలు ఉన్నాయి. సంబంధిత వర్క్ సెంటర్‌కు నిర్దేశించిన అర్హత జిల్లాల్లో (అనుబంధం-1) నివాసి అయి ఉండాలి, లేదా అదే జిల్లాల్లో అర్హత విద్యను పూర్తి చేసి ఉండాలి.

ఎంపికైన అభ్యర్థులకు శిక్షణా కాలంలో అర్హతను బట్టి నెలకు రూ.8,200 నుంచి రూ.12,300 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.12,300, మూడేళ్ల డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.10,900, 10వ/12వ తరగతి ట్రేడ్ అప్రెంటిస్‌లకు రూ.8,200, ఒకేళ్ల ఐటీఐ అప్రెంటిస్‌లకు రూ.9,600, రెండేళ్ల ఐటీఐ అప్రెంటిస్‌లకు రూ.10,560 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం

ఆసక్తి గల అభ్యర్థులు 20 నవంబర్ 2026లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ట్రేడ్ అప్రెంటిస్ (NAPS) పోస్టులకు https://apprenticeshipindia.gov.inలో, గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ (NATS) పోస్టులకు https://nats.education.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, ఎంపిక విధానం, ఖాళీల వివరాలు తదితర పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఓఎన్జీసీ అధికారిక వెబ్‌సైట్ www.ongcindia.comను సందర్శించవచ్చు. అధికారిక నోటిఫికేషన్ పీడీఎఫ్: https://www.ongcindia.com/documents/77751/2660534/Advertisement-engagement-Apprentices2026-27.pdf.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp