|  
● FLASH NEWS
BRS: నిర్మల్ రైతు గర్జన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై గులాబీ దళం ఫైర్  •  HMT: హెచ్‌ఎంటీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు మద్దతు.. కేంద్రంపై ఎమ్మెల్యే వివేకానంద్ ఫైర్  •  Supreme: వారసత్వ ఆస్తిలో మనవడికి హక్కు ఉండదు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు  •  Rice: కాంగ్రెస్ పాలనలో బియ్యం ధరల మంట.. బీఆర్ఎస్ నేత ఆగ్రహం  •  MEIL: వాటర్ సప్లై ప్రాజెక్టుల్లో ఉద్యోగాలు.. ఆంధ్రాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు  • 
Skip to content

Sports: రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు సిద్ధార్థ పాఠశాల విద్యార్థి ఎంపిక

రిపోర్టర్: Anil

పెద్దపల్లి, సూర్య న్యూస్ : రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు (State Level Handball Competitions) సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లిలోని సిద్ధార్థ నేహా పాఠశాలకు చెందిన విద్యార్థి కె.విశ్రుత్ ఎంపికయ్యాడు. గత నెలలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలలో విశ్రుత్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ అవకాశం దక్కించుకున్నట్లు సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు మహబూబ్ నగర్ జిల్లాలో అండర్-17 విభాగంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో విశ్రుత్ పాల్గొననున్నాడు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి ఘనంగా సత్కరించి, అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయని అన్నారు. తమ పాఠశాల విద్యార్థి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

భవిష్యత్తులోనూ విశ్రుత్ జాతీయ స్థాయి పోటీల్లో రాణించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థి సాధించిన ఈ విజయం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ రాణి, పీఈటీ జీవన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp