|  
FLASH NEWS
India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  •  Telangana Assembly : నా చీర లాగారు.. అసెంబ్లీ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి  •  హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. ఫన్నీ కౌంటర్‌తో క్లారిటీ ఇచ్చిన అమీషా పటేల్  •  నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు మూడు కీలక నివేదికలు  • 
Skip to content

ప్రగతి నగర్ అగ్నిప్రమాద బాధితులకు భరోసా: పరామర్శించిన ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్

నిజాంపేట్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ కేజీఆర్ కన్వెన్షన్ సమీపంలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటన తీవ్ర ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో పలు ఫర్నిచర్ షాపులు పూర్తిగా దగ్ధమవడంతో వ్యాపారులు రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ మరియు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ నేడు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులకు మనోధైర్యాన్ని కల్పించారు.

ఘటనా స్థలిని పరిశీలించిన నేతలు

​నిన్న రాత్రి 11 గంటల సమయంలో ప్రగతి నగర్ లోని ఫర్నిచర్ యూనిట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆస్తి మొత్తం బూడిదయ్యింది. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వెంటనే స్పందించి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. దగ్ధమైన దుకాణాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఈ పర్యటనలో నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ డెప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎక్స్ కార్పొరేటర్ రవికిరణ్, సాంబశివ రెడ్డి మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్

​ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ: “చిరు వ్యాపారులు కోట్లాది రూపాయల ఆస్తిని కోల్పోవడం అత్యంత బాధాకరం, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు అవసరమైన వసతులు కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలి” అని కోరారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మాట్లాడుతూ: బాధితులకు తాము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని, తగిన పరిహారం అందేలా అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు నిజాంపేట్ కార్పొరేషన్ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp