
అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా (Andhra Pradesh) ఖాళీగా ఉన్న 913 ఆశా కార్యకర్తల (ASHA Workers) పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. స్థానికంగా ఉండే మహిళలకు ఇదొక మంచి ఉపాధి అవకాశం కాగా, అర్హులైన వారు సంబంధిత అధికారుల ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
అర్హతలు, వయసు నిబంధనలు
ఈ ఆశా కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా ఆ సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన మహిళలై ఉండాలి. విద్యార్హత విషయానికి వస్తే కనీసం టెన్త్ క్లాస్ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, దరఖాస్తుదారుల వయసు 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలని నిబంధనల్లో స్పష్టం చేశారు.
ఎలా అప్లై చేయాలి? ఎంపిక ఎలా ఉంటుంది?
ఆసక్తి, అర్హత ఉన్న మహిళలు తమ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHC) లేదా అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (UPHC) ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే ‘డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ’ నేరుగా ఇంటర్వ్యూ చేసి అర్హులను ఎంపిక చేస్తుంది. ఈ నెలాఖరు (సెప్టెంబర్ 30) లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10,000 చొప్పున వేతనం లభిస్తుంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



