
హైదరాబాద్, సూర్య న్యూస్ : కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ (Women Empowerment Cell) ఆధ్వర్యంలో బతుకమ్మ (Bathukamma) వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చందన.ఎన్ ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని కొనియాడారు.
ఈ వేడుకల్లో కళాశాల మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో ఆకర్షణీయంగా బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ ఆడుతూ సంప్రదాయ పాటలతో కళాశాల ప్రాంగణంలో సందడి చేశారు.
ఈ ప్రత్యేక కార్యక్రమానికి కూకట్‌పల్లి సీఐ డి. స్వామి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ సంబురాల్లో చురుకుగా పాల్గొన్న విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఉత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థినులకు తన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



