|  
FLASH NEWS
​Nestle India : నెస్లే పిల్లల ఉత్పత్తులపై FSSAI కొరడా.. ఆ రెండు బ్రాండ్లపై కఠిన చర్యలకు సిద్ధం  •  Ramayana Movie : ‘రామాయణ’ ఇంగ్లీష్ వెర్షన్‌లో భారీ మార్పులు.. ఆ సీన్లు, పాటలు కట్?  •  Election Commission : టీఎంసీలో వర్గపోరు.. మమత, రెబెల్ గ్రూపులకు కొత్త పేర్లు, గుర్తులు కేటాయించిన ఈసీ  •  Zombie Reddy 2 : జాంబీ ప్రపంచంలోకి రియల్ స్టార్ ఎంట్రీ.. పవర్‌ఫుల్ వారియర్ లుక్‌లో ఉపేంద్ర  •  IND vs AFG 3rd T20 : ఆఫ్ఘనిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. సిరీస్ క్లీన్ స్వీప్  • 
Skip to content

Book Launch Event : హైదరాబాద్‌లో ఘనంగా కవి సమ్మేళనం, పుస్తకావిష్కరణ సభ.. డ్రగ్స్ మహమ్మారిపై ‘యుద్ధం మొదలైంది’

హైదరాబాద్, సూర్య న్యూస్ : యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై సాహితీ సమరం ప్రకటించేందుకు నగరంలో భారీ కవి సమ్మేళనం, పుస్తకావిష్కరణ సభ (Book Launch Event) జరగనుంది. కరీంనగర్‌కు చెందిన భవానీ సాహిత్య వేదిక, అక్షర కుసుమాలు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20న కూకట్‌పల్లి (Kukatpally) లోని సుందరయ్య భవన్‌లో ఈ ప్రతిష్టాత్మక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేదికగా సామాజిక చైతన్యాన్ని రగిలించే రెండు కీలక పుస్తకాలను ఆవిష్కరించనున్నారు.

ఆవిష్కరించనున్న పుస్తకాలు ఇవే..

డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన “యుద్ధం మొదలైంది”, “హృదయ పీఠిక” అనే రెండు పుస్తకాలను ఈ సభలో ఆవిష్కరిస్తున్నారు. ఇందులో ‘యుద్ధం మొదలైంది’ పుస్తకం డ్రగ్స్ రహిత సమాజం కోసం యువతను మేల్కొల్పే కవితా సంకలనంగా రూపొందించారు. ప్రముఖ కవుల హృదయ స్పందనల సమాహారంగా ‘హృదయ పీఠిక’ పుస్తకాన్ని తీసుకువస్తున్నారు.

ముఖ్య అతిథులు, కార్యక్రమ వివరాలు

డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన జరగనున్న ఈ సభలో శతాధిక గ్రంథకర్త బి.ఎస్. రాములు ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాలను ఆవిష్కరిస్తారు. ప్రముఖ రచయిత్రి వనజ బలుసాని ప్రధాన వక్తగా వ్యవహరిస్తారు. డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన్ రాజు, బైన దేవదాసు, సాదనాల వెంకటస్వామి నాయుడు, సి.హెచ్. మల్లయాచారి తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొంటారు.

ఈ నెల 20వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రగతినగర్‌లోని సుందరయ్య భవన్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆహ్వానికులు పరాంకుశం రఘునారాయణ తెలిపారు. ఈ సమ్మేళనంలో పాల్గొనే కవులు పేర్ల నమోదుకు సెప్టెంబర్ 18ని ఆఖరు తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గల సాహితీప్రియులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని, మరిన్ని వివరాలకు 8555838516, 9014559059 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp