|  
● FLASH NEWS
CEC: దేశద్రోహి జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్  •  Marathon: 44 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు చారిత్రక రజతం  •  Banks: ఖాతాదారులకు అలర్ట్.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్!  •  CBSE : ముదురుతున్న ‘ఓఎస్‌ఎం’ వివాదం.. నాలుగు నెలల్లో మూడో బాస్ నియామకం  •  Chandrababu : మత్స్యకారులకు సీఎం చంద్రబాబు వరం.. ఏకంగా 50 కిలోలు ఉచితం  • 
Skip to content

Chandrababu : మత్స్యకారులకు సీఎం చంద్రబాబు వరం.. ఏకంగా 50 కిలోలు ఉచితం

అమరావతి, సూర్య న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో సంభవించిన వరదల (AP Rains) నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఉచితంగా 50 కిలోల బియ్యం పంపిణీ చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.

అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. వరదలపై అన్ని శాఖల అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సమన్వయంతో పని చేస్తూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచించారు.

తగ్గిన వర్షపాతం లోటు

ఈ సమీక్షా సమావేశంలో పలు జిల్లాల్లోని రిజర్వాయర్లలోకి వస్తున్న వరద నీటి ప్రవాహంపై ఇరిగేషన్ అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక అందించారు. కాగా, తాజాగా కురుస్తున్న వానల కారణంగా రాష్ట్రంలో వర్షపాతం లోటు భారీగా తగ్గిందని అధికారులు వివరించారు. అంతకుముందు 50 శాతంగా ఉన్న ఈ వర్షపాతం లోటు, ఇప్పుడు 31 శాతానికి పడిపోయిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp