Skip to content

రెండు పార్టుల సినిమా అంటే ఇలా ఉండాలి: భారతీయ దర్శకులకు ధురంధర్ నేర్పిన పాఠం ఇదే

హైదరాబాద్, సూర్య న్యూస్ : భారతీయ సినిమా పరిశ్రమలో ఒక సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడం ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారిపోగా ఈ విధానం వెనుక కథ పెద్దగా ఉండటం ఒక కారణమైతే రెండు పార్టుల ద్వారా భారీ వసూళ్లు రాబట్టాలనే వ్యాపార ఆలోచన మరో ప్రధాన కారణం అని విశ్లేషకులు భావిస్తుంటారు, అయితే రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ధురంధర్ సినిమా ఈ రెండు పార్టుల ట్రెండ్ కు ఒక సరికొత్త అర్థాన్ని నేర్పుతూ కేవలం వంద రోజుల వ్యవధిలోనే రెండు భాగాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి సరికొత్త చరిత్ర సృష్టించింది.

గతేడాది డిసెంబర్ 5న ధురంధర్ మొదటి భాగం విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించగా ఎవరూ ఊహించని విధంగా మార్చి 19న రెండవ భాగాన్ని కూడా విడుదల చేసి దర్శకుడు ఆదిత్య ధర్ అందరినీ ఆశ్చర్యపరిచారు, సాధారణంగా ఒక సినిమా రెండు భాగాలుగా వస్తుంది అంటే మొదటి భాగం విడుదలయ్యాక ప్రేక్షకుల స్పందనను బట్టి కథలో మార్పులు చేయడం లేదా కమర్షియల్ హంగులు అద్ది బడ్జెట్ పెంచడం వంటివి చేసి రెండవ భాగాన్ని తీసుకురావడానికి కనీసం ఒకటి లేదా రెండేళ్ల సమయం తీసుకుంటారు కానీ ఆదిత్య ధర్ మాత్రం ముందే పక్కా ప్రణాళికతో కథను రాసుకుని షూటింగ్ పూర్తి చేసి కేవలం వంద రోజుల గ్యాప్ లోనే రెండవ పార్టును విడుదల చేసి అసలైన సీక్వెల్ ఎలా ఉండాలో నిరూపించారు.

📢 బ్రేకింగ్ న్యూస్ మిస్ అవ్వకండి!

తాజా వార్తలు వెంటనే పొందాలంటే Surya News అధికారిక WhatsApp Channel లో ఇప్పుడే Join అవ్వండి.

📲 Join WhatsApp Channel

బాహుబలి నుండి మొదలుపెడితే పుష్ప, కేజీయఫ్, కల్కి, దేవర, సలార్ వంటి పాన్ ఇండియా సినిమాలు అన్నీ కూడా మొదటి భాగం విడుదలైన తర్వాత రెండవ భాగం కోసం చాలా సమయం తీసుకుని కథనం మారుస్తూ బడ్జెట్ పెంచుకుంటూ పోయినవే అని సినీ వర్గాల్లో ముమ్మరంగా చర్చ జరుగుతోంది, ఇలాంటి తరుణంలో సినిమా కథ మొత్తం ముందుగానే సిద్ధమైన తర్వాత దాన్ని ఒకే పార్టులో చెప్పడం కుదరదు అనుకున్నప్పుడు మాత్రమే రెండు భాగాలుగా విడగొట్టి వెంటవెంటనే విడుదల చేయాలనే అసలైన పాఠాన్ని ఆదిత్య ధర్ మన ఫిల్మ్ మేకర్స్ కు నేర్పించారని మరియు ఈ వంద రోజుల గ్యాప్ ఫార్ములాను చూసైనా మన దర్శకులు రెండు పార్టుల పేరుతో ఏళ్ల తరబడి సమయం వృధా చేయకుండా ఒక పక్కా ప్రణాళికతో సినిమాలు తీస్తారో లేదో వేచి చూడాలని పలువురు సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp