
ఢాకా, సూర్య న్యూస్ డెస్క్ : ఢాకా వేదికగా జరుగుతున్న శాఫ్ ఛాంపియన్‌షిప్ (SAFF Championship) గ్రూప్-బి ఓపెనింగ్ మ్యాచ్‌లో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు దాయాది పాకిస్థాన్‌పై 3-2 స్కోరుతో ఉత్కంఠ విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో ఘనంగా బోణీ కొట్టింది.
మ్యాచ్ ఆరంభం నుంచే భారత ఆటగాళ్లు పాక్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. టీమిండియా ప్లేయర్ అహ్మద్ భట్ 13, 19వ నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ చేసి ప్రత్యర్థిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. ఆ తర్వాత 32వ నిమిషంలో మాంగ్లెంతంగ్ మూడో గోల్ సాధించడంతో భారత్ తొలి అర్ధభాగంలోనే 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఆట సెకండాఫ్‌లో పాకిస్థాన్ అనూహ్యంగా పుంజుకుని ఆకస్మిక దాడులకు దిగింది. భారత డిఫెన్స్‌ను ఛేదించి రెండు గోల్స్ నమోదు చేయడంతో మ్యాచ్ చివరి నిమిషాల వరకు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. అయితే, వ్యూహాత్మకంగా వ్యవహరించిన భారత జట్టు చివరకు తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుని పాక్‌పై 3-2 తేడాతో అద్భుత విజయాన్ని ఖాయం చేసుకుంది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



