|   
🔴 BREAKING NEWS ► TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే Teenmar Mallanna : తెలంగాణలో రెడ్ల విగ్రహాలు కూలగొడతాం.. రాబోయేది బీసీల రాజ్యమే అంటున్న తీన్మార్ మల్లన్న? Rega Kantha Rao Arrest : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. లైంగిక ఆరోపణల కేసులో పోలీసుల అదుపులో Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై హైకోర్టు స్టే.. అసలు కారణం ఇదే
Skip to content

IPL 2026 : విరాట్ కోహ్లీ ఊచకోత.. లక్నోపై ఆర్సీబీ ఘనవిజయం!

బెంగళూరు, సూర్య న్యూస్: ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బుధవారం చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో జరిగిన హై-వోల్టేజ్ పోరులో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar), రసిక్ సలామ్ నిప్పులు చెరిగితే.. బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

కుప్పకూలిన లక్నో బ్యాటింగ్..

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. రసిక్ సలామ్ (4/24), భువనేశ్వర్ కుమార్ (3/27) ధాటికి లక్నో బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. మిచెల్ మార్ష్ (Mitchell Marsh) 40 పరుగులు, ఆయుష్ బదోని 38 పరుగులు, ముకుల్ చౌదరి 39 పరుగులతో కాసేపు ప్రతిఘటించినప్పటికీ భారీ స్కోరు చేయలేకపోయారు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది.

కోహ్లీ ‘వన్ మ్యాన్ షో’..

147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (7), దేవదత్ పడిక్కల్ (10) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. కేవలం 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 49 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దురదృష్టవశాత్తు హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవేష్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయి అభిమానులను నిరాశపరిచాడు. అనంతరం రజత్ పటిదార్ (27), జితేష్ శర్మ (23) మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

పాయింట్స్ టేబుల్‌లో టాప్..

ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్స్ టేబుల్ (Points Table) లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి +1.503 నెట్ రన్ రేట్ తో అగ్రస్థానంలో నిలిచింది. మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ కుమార్ మాట్లాడుతూ.. “వయసు పెరుగుతున్న కొద్దీ ఫైన్ వైన్ లా మెరుగవుతున్నాను. మా ఫీల్డింగ్ అద్భుతంగా ఉంది, ముఖ్యంగా టీమ్ డెవిడ్, ఫిల్ సాల్ట్ పట్టిన క్యాచ్‌లు మ్యాచ్‌ను మలుపు తిప్పాయి” అని ధీమా వ్యక్తం చేశాడు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp