
ముంబై, సూర్య న్యూస్ : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పరువు తీసేలా ఆయన మాజీ ప్రియురాలు, ప్రముఖ మోడల్ సోఫియా హయత్ (Sofia Hayat) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో రోహిత్ వ్యక్తిగత జీవితంపై దారుణమైన కామెంట్స్ చేశారు.
2012 సమయంలో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ అప్పట్లో తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. ఆ వ్యవహారంపై రోహిత్ ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. తాజాగా సోఫియా తన ఇంటర్వ్యూలో ఆనాటి పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తనకు క్రికెట్ గురించి ఏమీ తెలియదని తన మేనేజర్ ద్వారానే ఆయనతో పరిచయం ఏర్పడిందని ఆమె వెల్లడించారు. రోహిత్ మైదానంలో అద్భుతమైన ఆటగాడు అయినప్పటికీ పడకగదిలో మాత్రం తనను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కొంతకాలం డేటింగ్ తర్వాత పలు విభేదాల కారణంగా తాము విడిపోయినట్లు సోఫియా తెలిపారు. ఈ ఇంటర్వ్యూ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రోహిత్ జీవితంలో తానే తొలి మహిళను అని ఆమె పేర్కొన్నారు. ప్రైవేట్ జీవితంలో మహిళల మనోభావాలను ఎలా గౌరవించాలో పురుషులకు ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం ఉందని ఆమె పోస్ట్ చేశారు. దశాబ్దానికి పైగా గడిచిపోయిన పాత విషయాలను ఇప్పుడు బహిర్గతం చేయడంపై క్రీడాభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేవలం తన పాడ్కాస్ట్ పబ్లిసిటీ కోసమే సోఫియా ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందంటూ నెట్టింట ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



