
పుణె, సూర్య న్యూస్ : కాబోయే భర్త కేతన్‌ను అతి కిరాతకంగా చంపిన యువతి సియా (Siya Murder Case) కేసులో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఈ దారుణ హత్య నుంచి తప్పించుకోవడానికి ఆమె ఏకంగా క్రైమ్ పాడ్‌కాస్ట్‌లు, మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు వంటి వాటిని అధ్యయనం చేసినట్లు పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
సీసీ కెమెరాలు లేని ఏరియాలో పక్కా ప్లాన్
మర్డర్ స్కెచ్‌లో భాగంగా నిందితురాలు తొలుత లోహగడ్ కోటలోని సీసీటీవీ కెమెరాలు (CCTV Cameras) లేని ప్రాంతాన్ని పక్కాగా గుర్తించిందని దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఒక గుర్తు తెలియని అమ్మాయి ఫోటోను ఉపయోగించి ‘మహి’ పేరుతో ఒక ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీని (Fake Instagram ID) క్రియేట్ చేసింది. ఆ మహి తన ఫ్రెండ్ అని, ఆమెతో మాట్లాడుతున్నట్లుగా కొన్ని ఫేక్ మెసేజ్‌లను కేతన్‌కు చూపించి నమ్మించింది.
బర్త్‌డే సర్ ప్రైజ్ పేరుతో తీసుకెళ్లి..
ఆమెకు బర్త్‌డే సర్ ప్రైజ్ ఇద్దామని మాయమాటలు చెప్పి కేతన్‌ను నేరుగా లోహగడ్ కోట పైకి తీసుకెళ్లిందని సమాచారం. అక్కడ పక్కా ప్లాన్ ప్రకారం ముందుగా అనుకున్నట్లుగానే అతడిని కోట పైనుంచి కిందకు తోసేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సినిమా తరహాలో సాగిన ఈ హత్య ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
ఈ వార్తపై మీ స్పందన?

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



