|  
FLASH NEWS
YouTuber Nandus World Rama Nandana : యూట్యూబర్ రమా నందన అరెస్ట్.. లండన్ వీసా స్కామ్‌లో దిమ్మతిరిగే నిజాలు  •  నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం.. ఉద్యోగాల భర్తీకి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్  •  AP Politics : వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా.. కీలక పదవులకు గుడ్‌బై  •  India vs Afghanistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత మ్యాప్‌లో చూపిన అఫ్గానిస్తాన్.. మండిపడుతున్న పీసీబీ  •  YouTuber Nandana : నిరుద్యోగులకు భారీ టోకరా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన ప్రముఖ యూట్యూబర్  • 
Skip to content

Delhi High Court : సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో అక్రమ నిర్బంధం.. హైకోర్టును ఆశ్రయించిన సోనమ్ వాంగ్ చుక్ భార్య

New Delhi, Surya News: ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు (Environmental activist) సోనమ్ వాంగ్ చుక్ (Sonam Wangchuk) భార్య గీతాంజలి ఆంగో దిల్లీ హైకోర్టును (Delhi High Court) ఆశ్రయించారు. సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో (Safdarjung Hospital) తన భర్తను అక్రమంగా నిర్బంధించారని (illegal detention) ఆమె పిటిషన్ లో ఆరోపించారు.

తన భర్తను వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. ఆయనకు చికిత్స అందించిన వ్యక్తిగత వైద్యులు మరియు న్యాయవాదులను కలిసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 21 రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్షా శిబిరం నుంచి పోలీసులు వాంగ్ చుక్ ను శనివారం సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆసుపత్రిలోనే తన దీక్షను కొనసాగిస్తున్నారని గీతాంజలి ఆంగో తెలిపారు.

చికిత్స విషయంలో ఆసుపత్రి పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ఆసుపత్రిపై తమకు నమ్మకం పోయిందని స్పష్టం చేశారు. డిశ్చార్జ్ చేయాలని, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరినా అధికారులు నిరాకరించారని ఆమె పేర్కొన్నారు. ఆసుపత్రిలో తనపై కూడా ఆంక్షలు విధించారని చెప్పారు. వంద మందికి పైగా పోలీసులు ఆసుపత్రిలో మోహరించారని, వాంగ్ చుక్ ఉన్న అంతస్తులోనే 30 మంది సిబ్బంది ఉన్నట్లు ఆమె తెలిపారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp