|  
FLASH NEWS
BRS Fake Account: సీఎం రేవంత్ చదివిన పోస్ట్‌పై సైబర్ క్రైమ్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు  •  AP CM Chandrababu : మద్యం, ఇసుక అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు.. అధికారులకు సీఎం వార్నింగ్  •  Botsa Satyanarayana Cry: చీపురుపల్లిలో బోరుమన్న బొత్స సత్యనారాయణ.. కార్యకర్తల ముందే భావోద్వేగం!  •  Bank Strike: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకో మీరే తెలుసుకోండి..  •  Kaloji Narayana Rao Jayanthi: ఎదిరించిన అక్షరాయుధం.. తెలంగాణ భాషా దినోత్సవం వేళ ప్రజాకవి కాళోజీ సమగ్ర స్మరణ  • 
Skip to content

Stalin vs CM Vijay: బాడీ షేమింగ్ వివాదం.. ముఖ్యమంత్రి విజయ్‌పై విరుచుకుపడ్డ డీఎంకే చీఫ్ స్టాలిన్

Body shaming issue cm vijay stalin
Body shaming issue cm vijay stalin

చెన్నై, సూర్య న్యూస్ : తమిళనాడు రాజకీయాల్లో బాడీ షేమింగ్ వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. తన దవడను చూపిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) ఎగతాళి చేశారన్న వార్తలపై ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ప్రజాస్వామ్యం కోసం పోరాడి తాను తిన్న దెబ్బలకు ఆ దవడ విరిగిందని గుర్తుచేస్తూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను బలంగా తిప్పికొట్టారు.

ఈ మేరకు ముఖ్యమంత్రిని తమ్ముడు విజయ్ అని సంబోధిస్తూ స్టాలిన్ చురకలు అంటించారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించినందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని రద్దు చేసి, తనను అరెస్టు చేసి జైలుకు పంపిందని ఆయన గుర్తుచేశారు. జైల్లో జరిగిన భౌతిక దాడిలోనే తన దవడ విరిగిందని, ప్రజా పోరాటంలో తగిలిన ఆ గాయాన్ని చూసి తాను ఎంతగానో గర్విస్తున్నానని ఉద్ఘాటించారు. గతాన్ని, చరిత్రను ఎవరూ మార్చలేరని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయ విమర్శలకు దీటుగా బదులివ్వలేక, పరిపాలనాపరమైన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి ఇలాంటి వ్యవహారాలకు తెరతీస్తున్నారని డీఎంకే చీఫ్ ఆరోపించారు. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిపాలన అంతా ఒక సినిమా షూటింగ్‌లాగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఇలా వ్యక్తిగత దాడులకు దిగడం ముఖ్యమంత్రి స్థాయికి తగదని స్టాలిన్ హితవు పలికారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp