|  
● FLASH NEWS
Flydubai: విమానం కూల్చేయాలనేదే నా ప్లాన్.. కో-పైలట్ సంచలన నిజాలు  •  Jaladhara: ఏపీలో రూ.30 వేల కోట్లతో ‘అమరజీవి జలధార’ లాంచ్  •  EVMs: పేపర్ బ్యాలెట్ కోసం ఢిల్లీలో పోరాటం : కల్వకుంట్ల కవిత  •  Housing: ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన  •  Honeytrap: పాక్ కిలేడీ వలలో నేవీ ఉద్యోగి.. అరెస్ట్  • 
Skip to content

Voter Enrollment : కుత్బుల్లాపూర్ సూరారం డివిజన్‌లో ముమ్మరంగా ఓటరు నమోదు కార్యక్రమం

హైదరాబాద్, సూర్య న్యూస్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం (Quthbullapur Constituency) పరిధిలోని 129 సూరారం డివిజన్ టీఎస్ఐఐసీ కాలనీలో (TSIIC Colony) ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ వెరిఫికేషన్ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధ్యక్షులు పుప్పాల భాస్కర్, కాలనీ అధ్యక్షులు నేతి రాజా పాల్గొన్నారు.

సంబంధిత బీఎల్ఓలు (BLOs), బీఎల్ఏలతో కలిసి వీరు పోలింగ్ బూత్‌లను సందర్శించారు. ఓటరు మహాశయులకు పేర్ల నమోదు, చిరునామా మార్పు గురించి వివరించారు. పేరు, వయస్సు తదితర వివరాల సవరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కొత్త ఓటరు నమోదు విధానం, దానికి అవసరమైన పత్రాల గురించి సమగ్రంగా తెలియజేశారు.

స్థానిక అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వెల్ఫేర్ కమిటీ సభ్యులు బీఎల్ఓలకు (BLOs) పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎన్యుమరేషన్ ఫారాలు ప్రతి ఇంటికి చేరేలా అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇతర బస్తీల్లో నివసిస్తున్న ఓటర్ల వివరాల సేకరణలో కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ నాయకులు సాయిబాబా, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రోషన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp