|  
● FLASH NEWS
Konda Surekha: మంత్రి పదవి పోయిందన్న బాధ లేదు.. అనుచరులపై ఈగవాలినా ఊరుకోం  •  AsianGames: ట్రాక్‌పై భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన.. ఖాతాలో మరో స్వర్ణం  •  PawanKalyan: వైసీపీ పాలనలో బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని దుస్థితి  •  AP Liquor: క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మద్యం నాణ్యత తెలుసుకోండి  •  Supreme Court: సుప్రీంకోర్టు జడ్జిగా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్?  • 
Skip to content

T20 World Cup 2026: ముచ్చటగా మూడోసారి టీమిండియాదే కిరీటం – ఫైనల్లో న్యూజిలాండ్ పై 96 పరుగుల తేడాతో భారత్ చారిత్రక విజయం

అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది, న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలుపొంది పొట్టి కప్‌ను మరోసారి ముద్దాడింది, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా (సూర్య సేన) సమిష్టి కృషితో కివీస్‌ను చిత్తు చేసి 140 కోట్ల భారతీయుల కలను నిజం చేసింది

​భారత బ్యాటర్ల విధ్వంసం:

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది, ఓపెనర్లు సంజు శాంసన్ 89 పరుగులు, అభిషేక్ శర్మ 52 పరుగులతో విధ్వంసం సృష్టించారు, ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులతో దూకుడుగా ఆడాడు, శాంసన్ అవుటైన తర్వాత కాస్త మందగించిన స్కోరు బోర్డును ఆఖర్లో శివం దూబే సిక్సర్లతో పరుగులు పెట్టించి జట్టు స్కోరును 250 దాటించాడు

కివీస్ పతనాన్ని శాసించిన బుమ్రా, అక్షర్:

256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఏ దశలోనూ భారత బౌలర్లు అవకాశం ఇవ్వలేదు, భారత బౌలర్ల ధాటికి కివీస్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది, కివీస్ బ్యాటర్లలో వికెట్ కీపర్ టిమ్ సైఫర్ట్ 26 బంతుల్లో 52 పరుగులు, కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 35 బంతుల్లో 43 పరుగులు చేసి పోరాడే ప్రయత్నం చేశారు

​భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించి 4 వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా, అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టి కివీస్ నడ్డి విరిచాడు, వరుణ్ చక్రవర్తి మరియు హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసుకుని విజయానికి బాటలు వేశారు, బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన సూర్య సేన ఏకపక్షంగా విజయాన్ని సొంతం చేసుకుంది

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp