|  
FLASH NEWS
Tollywood Director Arrest : పెళ్లి పేరుతో నటిని మోసం చేసిన టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అరెస్ట్… చంచల్‌గూడ జైలుకు తరలింపు  •  TOXIC Movie Review : ‘కేజీఎఫ్’ స్థాయి మ్యాజిక్ రిపీట్ అయిందా? యశ్ ‘టాక్సిక్’ సినిమా అసలు కథ మరియు పబ్లిక్ టాక్ ఇదే  •  Suryapet Road Accident : సూర్యాపేటలో ఘోర బస్సు ప్రమాదం.. నిద్రమత్తులో ఉండగానే ఆరుగురు బలి!  •  సూర్య న్యూస్ ఎక్స్‌క్లూజివ్: బంగాళాఖాతంలో మునిగిపోయిన భారీ కార్గో నౌక.. 22 మంది సిబ్బంది గల్లంతు.. రక్షణ చర్యల్లో కోస్ట్ గార్డ్, నేవీ  •  Telangana Auto Strike : ప్రయాణికులకు ఊరట.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమ్మె విరమణ  • 
Skip to content

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏబీవీపీ అండ : షాపూర్ నగర్‌లో ఉచిత పరీక్ష సామగ్రి పంపిణీ

మేడ్చల్, సూర్య న్యూస్ : పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మేడ్చల్ జిల్లా చింతల్ నగర్ శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు, షాపూర్ నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న సుమారు వంద మంది విద్యార్థులకు ఉచితంగా ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులతో పాటు తరగతి గదికి రెండు ఫ్యాన్లను ఏబీవీపీ నాయకులు అందజేశారు.

ఈ సందర్భంగా స్క్రీన్ టైమ్ టు ఎగ్జామ్ టైమ్ అనే నినాదంతో విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతపై అవగాహన కల్పించారు, పరీక్షల సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పక్కనపెట్టి సమయాన్ని వృథా చేయకుండా చదువుపై దృష్టి సారించాలని సూచించారు, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, వారికి విద్యాపరంగా ఎలాంటి సహాయం కావాలన్నా ఏబీవీపీ ఎప్పుడూ ముందుంటుందని నాయకులు భరోసా ఇచ్చారు.

ఈ సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కూకట్‌పల్లి విభాగ కన్వీనర్ రేగోడు నాగేష్, అడ్వకేట్ కేశవ్, మేడ్చల్ జిల్లా కన్వీనర్ మృత్యుంజయ, చింతల్ నగర సంయుక్త కార్యదర్శి చందు, మైసమ్మగూడ నగర కార్యదర్శి శివ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆశిష్ తదితరులు పాల్గొన్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp