|  
● FLASH NEWS
HMWSSB: హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు ప్రారంభం  •  Jagan: పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయను: వైఎస్ జగన్  •  Ebola: ప్రపంచానికి ఎబోలా ముప్పు.. రెడ్ అలర్ట్‌లో యూరప్!  •  OmarAbdullah: జమ్మూకశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు!  •  Iran: మళ్లీ దాడికి దిగితే అమెరికాకు ఓటమి తప్పదు: ఇరాన్  • 
Skip to content

Telangana News : రాష్ట్ర కొత్త పోలీస్ బాస్ వచ్చేశారు.. తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ నియామకం.. పూర్తి వివరాలు ఇవే.

Hyderabad, Surya News: తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (Telangana DGP) గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ (CV Anand) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్న శివధర్ రెడ్డి పదవీకాలం ఏప్రిల్ 30వ తేదీతో ముగియనుంది. ఆయన స్థానంలో పూర్తిస్థాయి డీజీపీగా (Full-time DGP) సీవీ ఆనంద్ పేరును ప్రభుత్వం ప్రకటించింది. ఆయన మే 1వ తేదీ నుంచి నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు.

సీవీ ఆనంద్ 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి (IPS Officer). రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగేలా నియమించింది. ఆయన ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక కార్యదర్శిగా (Special Chief Secretary) సేవలు అందిస్తున్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాబోయే రెండేళ్ల పాటు పోలీసు శాఖను ఆయన ముందుండి నడిపించనున్నారు.

​సీవీ ఆనంద్ కు పోలీసు శాఖలో విభిన్న హోదాల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఆయన హైదరాబాద్ (Hyderabad), సైబరాబాద్ (Cyberabad), విజయవాడ పోలీస్ కమిషనర్ గా (Police Commissioner) పనిచేశారు. అలాగే కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ఎస్పీగా కూడా సేవలు అందించారు. ముఖ్యంగా పోలీసు శాఖలో కొత్త టెక్నాలజీని (New Technology) పటిష్టంగా అమలు చేయడంలో ఆయన ముందుంటారు. సైబర్ నేరాలను (Cyber Crimes) అరికట్టడంలో సీవీ ఆనంద్ దిట్ట అని పోలీసు వర్గాల్లో పేరుంది.

ఈ వార్తపై మీ స్పందన?

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📲 Join WhatsApp