
Hyderabad, Surya News: హైదరాబాద్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ (Hyderabad District Swimming Association) అనుబంధంగా ‘స్విమ్మింగ్ గాలా-2026’ (Swimming Gala 2026) ఘనంగా జరిగింది. జియాన్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ అకాడమీలో (Zion Sportz Swimming Academy) జూన్ 28న ఈ పోటీలను స్పోర్టిఫ్స్ ఎంగేజెస్ (Sportifs Engages) సంస్థ నిర్వహించింది. ఈ క్రీడా వేడుకలో 3 సంవత్సరాల వయసు నుంచి 15-16 ఏళ్ల వయసు గల చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా వివిధ విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి.

ఈ కార్యక్రమానికి పలువురు విశిష్ట అతిథులు హాజరయ్యారు. ముఖ్యంగా ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) డిప్యూటీ కమాండెంట్, తెలంగాణ నేషనల్ స్విమ్మర్ ఎస్. ఉదయ్ కుమార్ (S. Uday Kumar) విచ్చేశారు. పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు ఆయన చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ స్పోర్ట్స్ ఈవెంట్ లో హైదరాబాద్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ గిరిధర్ రావు (Giridhar Rao) పాల్గొన్నారు. అలాగే జియాన్ స్పోర్ట్స్ అకాడమీ డైరెక్టర్ మరియు హెడ్ కోచ్ జాన్ సిద్ధిక్ (John Siddique) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పతకాలు సాధించిన క్రీడాకారులను పలువురు ప్రముఖులు, తల్లిదండ్రులు ప్రశంసించారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



