|   
🔴 BREAKING NEWS ► Kukatpally News : రాష్ట్ర స్థాయి అవార్డులు కొల్లగొట్టిన కూకట్‌పల్లి జర్నలిస్టులు – ఘనంగా సన్మానించిన TWJF TTD Fake Websites Alert : తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఆ లింక్స్ క్లిక్ చేస్తే డబ్బులు గోవిందా Telangana Police Jobs Age Limit : తెలంగాణ పోలీసు అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పెరిగిన వయోపరిమితి (Age Limit).. పూర్తి వివరాలు ఇవే Teenmar Mallanna : తెలంగాణలో రెడ్ల విగ్రహాలు కూలగొడతాం.. రాబోయేది బీసీల రాజ్యమే అంటున్న తీన్మార్ మల్లన్న? Rega Kantha Rao Arrest : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్.. లైంగిక ఆరోపణల కేసులో పోలీసుల అదుపులో
Skip to content

World Photography Day : కూకట్‌పల్లిలో ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవం.. జర్నలిస్టులకు సత్కారం

కూకట్‌పల్లి, సూర్య న్యూస్: శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్‌లో కూకట్‌పల్లి ప్రెస్ క్లబ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు (World Photography Day) అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు ముఖ్య నేతృత్వం వహించారు.

ప్రజల సమస్యలను, సమాజంలోని వాస్తవ పరిస్థితులను తమ కెమెరా కళ్లతో ప్రతిబింబిస్తూ విశేష సేవలందిస్తున్న నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్, ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ మాచర్ల నాగేశ్వరరావులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి వారికి ప్రత్యేక అవార్డులను అందజేశారు.

​ఈ సందర్భంగా ఎర్ర యాకయ్య మాట్లాడుతూ ఒక చిత్రం కోట్ల మాటలు మాట్లాడుతుందని, వేల ప్రశ్నలను సంధిస్తూ లక్షల సమాధానాలకు సమానంగా నిలుస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పుట్టి నగేష్, కమిటీ సభ్యులు సుజాత, అనిల్ కిషోర్, శివతో పాటు పలువురు స్థానిక పాత్రికేయులు పాల్గొన్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp