|  
FLASH NEWS
Suryapet Road Accident : సూర్యాపేటలో ఘోర బస్సు ప్రమాదం.. నిద్రమత్తులో ఉండగానే ఆరుగురు బలి!  •  సూర్య న్యూస్ ఎక్స్‌క్లూజివ్: బంగాళాఖాతంలో మునిగిపోయిన భారీ కార్గో నౌక.. 22 మంది సిబ్బంది గల్లంతు.. రక్షణ చర్యల్లో కోస్ట్ గార్డ్, నేవీ  •  Telangana Auto Strike : ప్రయాణికులకు ఊరట.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమ్మె విరమణ  •  AP Job Calendar 2026 : ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల  •  అనకాపల్లిని దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు  • 
Skip to content

Suryapet Road Accident : సూర్యాపేటలో ఘోర బస్సు ప్రమాదం.. నిద్రమత్తులో ఉండగానే ఆరుగురు బలి!

Suryapet accident
Suryapet accident

సూర్యాపేట, సూర్య న్యూస్: సూర్యాపేట (Suryapet) జిల్లా పరిధిలో బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఒక ఫ్రెష్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Bus) అదుపుతప్పి ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ భయానక ఘటనలో ఆరుగురు ప్రయాణికులు (Passengers) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

కోదాడ మండలం దొరకుంట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు ఢీకొట్టిన కంటైనర్ లారీలో ఐరన్ లోడ్ ఉంది. వేగంగా ఢీకొట్టడంతో ఆ ఐరన్ దిమ్మెలు బస్సులోకి దూసుకెళ్లాయి. దీనివల్లే ప్రయాణికులు దారుణంగా మృతి చెందినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp