
నిజామాబాద్, సూర్య న్యూస్ : బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో పార్టీ అధినేత కేసీఆర్‌కు అండగా ఉన్నది తానా లేక కవితనా అని ఆయన బహిరంగంగా ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. కవిత రహస్యంగా కాంగ్రెస్ నేతలను కలవలేదని చెప్పగలరా అని సవాల్ విసిరారు.
నిజామాబాద్ జిల్లాలోని లింబాద్రిగుట్ట నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనపై కవిత చేసిన వ్యాఖ్యలకు ఆయన తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లోకి కవిత మధ్యలో వచ్చారని, మళ్లీ మధ్యలోనే వెళ్లారని ఆయన విమర్శించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎవరితోనూ ఎలాంటి మంతనాలు జరపలేదని, ఈ విషయాన్ని నరసింహస్వామి సాక్షిగా చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు. కానీ, కవిత కాంగ్రెస్ నేతలను కలవలేదని ప్రమాణం చేసి చెప్పగలరా అంటూ ఆయన నిలదీశారు.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



