|  
FLASH NEWS
వెనక్కి తగ్గిన రాజగోపాల్ రెడ్డి? నకిరేకల్ సీఎం సభకు హాజరు..  •  తెలుగు వర్సిటీ జర్నలిజం విద్యార్థుల వినూత్న ప్రయత్నం.. నేడు ‘గురుదక్షిణ’ కవితా సంకలనం ఆవిష్కరణ  •  Giorgia Meloni : యుద్ధానంతర ఇటలీ చరిత్రలో జార్జియా మెలోనీ అరుదైన రికార్డు.. ప్రధాని మోదీ అభినందనలు  •  ISRO EOS-08 : ఇస్రో మరో అద్భుతం.. నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ3  •  బండి సంజయ్ : “15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే.. ఇదా దేశభక్తి?”  • 
Skip to content

తెలుగు వర్సిటీ జర్నలిజం విద్యార్థుల వినూత్న ప్రయత్నం.. నేడు ‘గురుదక్షిణ’ కవితా సంకలనం ఆవిష్కరణ

telugu university gurudakshina
telugu university gurudakshina

హైదరాబాద్, సూర్య న్యూస్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (Telugu University) జర్నలిజం విద్యార్థులు (Journalism Students) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువుల విశిష్టతను తెలియజేస్తూ వారు రూపొందించిన ‘గురుదక్షిణ’ కవితా సంకలనం పుస్తకావిష్కరణ సభ శనివారం జరగనుంది.

తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 60 మంది కవులు ఈ కవితా సంకలనంలో భాగస్వాములయ్యారు. గురువుల గొప్పదనాన్ని, వారి ప్రాముఖ్యతను వివరిస్తూ అద్భుతమైన కవితలను ఇందులో పొందుపరిచారు.

ముఖ్య అతిథులుగా వర్సిటీ ప్రముఖులు

అంజిబాబు ఫౌండేషన్ సహకారంతో బాచుపల్లిలోని తెలుగు యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ పుస్తకావిష్కరణ వేడుకను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెల్దండ నిత్యానందరావు విశిష్ట అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు, జర్నలిజం విభాగాధిపతి బిహెచ్. పద్మప్రియ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు.

ఈ కవితా సంకలనానికి కొండూరి కోటిబాబు, నాగుల ఆంజనేయులు (అంజిబాబు), ఎస్. కల్యాణ్ దాస్ సంపాదకులుగా వ్యవహరించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముందు గురుపూజోత్సవం సందర్భంగా జర్నలిజం అధ్యాపకులను విద్యార్థులు ఘనంగా సత్కరించనున్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp