|  
FLASH NEWS
CM Revanth Reddy : సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేసీఆర్ ఫైర్.. కాంగ్రెస్ పాలన థర్డ్ క్లాస్ అంటూ విమర్శలు  •  YS Sharmila : వైఎస్సార్ ఇంట మరో పెళ్లి సందడి.. అంజలి రెడ్డి వరుడు ఎవరంటే?  •  Miss World 2026 : విశ్వసుందరి కిరీటం ఆ దేశం సొంతం.. సగంలోనే ఆగిపోయిన భారత సుందరి ప్రయాణం!  •  రేవంత్‌తో ‘రాజన్న’ దోస్తీ!కేబినెట్ బెర్త్ ఖాయమా? మునుగోడు క్యాడర్‌లో నయాజోష్…  •  పాకిస్థాన్‌ను చిత్తుచేసిన భారత్.. సెమీస్‌లో అడుగుపెట్టిన దాయాది.. షెఫాలీ సరికొత్త రికార్డ్  • 
Skip to content

Teachers Day : దామెర భీమనపల్లి పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం.. గురువులకు సత్కారం

teachers day celebrations damera bhimanapalli
teachers day celebrations damera bhimanapalli

మర్రిగూడ, సూర్య న్యూస్ : జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం (National Teachers Day) సందర్భంగా మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ఎంపీపీఎస్ (MPPS) పాఠశాలలో గురువులకు ఘన సత్కారం జరిగింది. వడ్డగాని ఇందిరా విద్యాదీపం ఫౌండేషన్ చైర్మన్ వడ్డగాని సాయిరాం సౌజన్యంతో విద్యార్థులు తమ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సన్మానించి గురుభక్తిని చాటుకున్నారు.

ఈ కార్యక్రమం ప్రారంభంలో ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రను, ఉపాధ్యాయ దినోత్సవ విశిష్టతను ఆయన సవివరంగా వివరించారు.

ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉత్సాహంగా పాల్గొంది. ఉపాధ్యాయులు వై. మంజులత, సభావత్ వెంకట్ కుమార్, మీనా కుమారి, అమీనాతో పాటు పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp