
- పూర్వ విద్యార్థి వెంకటేష్ చొరవతో ముందుకు వచ్చిన సంస్థ
- రూ. 18.32 లక్షల సీఎస్ఆర్ నిధులతో బృహత్తర కార్యక్రమం
మర్రిగూడ: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మర్రిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ ఆదర్శవంతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఇదే పాఠశాలలో చదివి వృద్ధిలోకి వచ్చిన పూర్వ విద్యార్థి వెంకటేష్ తన మాతృపాఠశాలపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. ఆయన ప్రత్యేక అభ్యర్థన మేరకు, కెనరా రొబెకో ఫౌండేషన్’ (Canara Robeco Foundation)
ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల నుంచి ఏకంగా రూ. 18.32 లక్షలు వెచ్చించి ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా 230 మంది విద్యార్థులకు గానూ 229 సైకిళ్లను అందజేశారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమంతో విద్యార్థుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత కూడా చదువుకున్న బడిని, ఉపాధ్యాయులను మరువని పూర్వ విద్యార్థి చొరవను పలువురు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మారం గోపాల్‌రెడ్డి, శశిధర్‌రాజు, స్థానిక సర్పంచ్ శిరీష, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈవో శారద, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రూపుసింగ్, ఎస్ఐ రాంబాబు తదితరులు విశేషంగా పాల్గొని విద్యార్థులకు సైకిళ్లను అందజేసి ఆశీర్వదించారు.


🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



