|  
FLASH NEWS
CM Revanth Reddy : సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేసీఆర్ ఫైర్.. కాంగ్రెస్ పాలన థర్డ్ క్లాస్ అంటూ విమర్శలు  •  YS Sharmila : వైఎస్సార్ ఇంట మరో పెళ్లి సందడి.. అంజలి రెడ్డి వరుడు ఎవరంటే?  •  Miss World 2026 : విశ్వసుందరి కిరీటం ఆ దేశం సొంతం.. సగంలోనే ఆగిపోయిన భారత సుందరి ప్రయాణం!  •  రేవంత్‌తో ‘రాజన్న’ దోస్తీ!కేబినెట్ బెర్త్ ఖాయమా? మునుగోడు క్యాడర్‌లో నయాజోష్…  •  పాకిస్థాన్‌ను చిత్తుచేసిన భారత్.. సెమీస్‌లో అడుగుపెట్టిన దాయాది.. షెఫాలీ సరికొత్త రికార్డ్  • 
Skip to content

PM Shri Model School : మర్రిగూడ పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

pm shri model school marriguda teachers day
pm shri model school marriguda teachers day

మర్రిగూడ, సూర్య న్యూస్ : నల్గొండ జిల్లా మర్రిగూడలోని పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో (PM Shri Model School) శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పుతున్న ఉపాధ్యాయులను శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి ఆత్మీయంగా సన్మానించారు. విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే దిక్సూచి

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పాఠశాల ప్రిన్సిపాల్ ఉయ్యాల వెంకటేశం అన్నారు. విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడం మాత్రమే కాకుండా, వారిలో క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యత, దేశభక్తిని పెంపొందించడం ఉపాధ్యాయుల ప్రాథమిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి భవిష్యత్తును మాత్రమే కాకుండా, కుటుంబం, సమాజం, దేశ భవిష్యత్తును సైతం ప్రభావితం చేయగలడని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి సరైన మార్గదర్శకత్వం అందించడమే నిజమైన సేవ అని ఉయ్యాల వెంకటేశం అభిప్రాయపడ్డారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగడమే ఉపాధ్యాయులకు ఇచ్చే అసలైన గౌరవం అని ఆయన వివరించారు.

సమగ్ర విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు

ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం పుస్తక విద్యకే పరిమితం కాకుండా, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, క్రీడలు, యోగా, ఆరోగ్యంతో పాటు నైతిక విలువలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రిన్సిపాల్ తెలిపారు. విద్యార్థులను అన్ని రంగాల్లో సమగ్రంగా తీర్చిదిద్దేందుకు మోడల్ స్కూల్‌లోని ప్రతి ఉపాధ్యాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించడంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు ఆర్. కరుణాకర్, జి. సబిత, పి. శ్రీనివాస్, వి. దొరతి, జి. మాధురి, పి. లింగస్వామి, డి. భవాని, కె. నాగమనీషా, ఎన్. వెంకటయ్య, మహమ్మద్ రజియుద్దీన్, బి. సూర్యకుమారి, టి. అనురాధ తదితరులతో పాటు నాన్ టీచింగ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp