
హైదరాబాద్, సూర్య న్యూస్ : ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, ప్రతిపక్ష నాయకుడు కె. చంద్రశేఖర్ రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. సీఎం మాటలను చిల్లర మాటలుగా అభివర్ణించిన కేసీఆర్.. రాష్ట్రంలో పాలన చేతకాకనే బూతులు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అని మాజీ ముఖ్యమంత్రి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ తీరును థర్డ్ క్లాస్ పాలనగా ఆయన అభివర్ణించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని, అందుకే ఈ లోపు రాష్ట్రంలో దోపిడీలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
రాజకీయ దుమారం
కేసీఆర్‌ను అసెంబ్లీకి హాజరు కావాలని, లేకుంటే గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఇటీవల రేవంత్ రెడ్డి సవాలు విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతల మధ్య రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం వ్యాఖ్యలకు ప్రతిస్పందనగానే కేసీఆర్ ఈ ఘాటు విమర్శలు చేసినట్లు స్పష్టమవుతోంది.

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు
ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు



