|  
FLASH NEWS
Telangana Assembly : నా చీర లాగారు.. అసెంబ్లీ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి  •  హార్దిక్ పాండ్యాతో డేటింగ్ రూమర్స్.. ఫన్నీ కౌంటర్‌తో క్లారిటీ ఇచ్చిన అమీషా పటేల్  •  నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు మూడు కీలక నివేదికలు  •  జాతీయ స్థాయి నృత్యోత్సవంలో హైదరాబాద్ విద్యార్థినుల సత్తా.. పతకాల పంట పండించిన కందుల నాట్యాలయ బృందం  •  నా చావు కోరుతూ సభకు రమ్మంటున్నారు : రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్.. అసెంబ్లీ వ్యూహాలపై బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం  • 
Skip to content

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు మూడు కీలక నివేదికలు

telangana assembly three reports
telangana assembly three reports

హైదరాబాద్, సూర్య న్యూస్ : తెలంగాణ శాసనసభ (Telangana Assembly) వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగా, మొదటి కార్యక్రమంగా ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. తొలిరోజు ఎజెండాలో భాగంగా ప్రశ్నోత్తరాలతో పాటు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పలు కీలక నివేదికలను సభ ముందుంచనున్నారు.

సభ ముందుకు ఆడిట్ నివేదికలు

ఈ సమావేశాల్లో తెలంగాణ సమగ్ర శిక్ష (టీఎస్‌ఎస్‌) 2024-25 ఆడిట్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) 2024-25 ఆడిట్ నివేదిక కూడా సభ ముందుకు రానుంది.

హైదరాబాద్ మెట్రో వార్షిక నివేదికలు

వీటితో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు సంబంధించి ఐదు వార్షిక నివేదికలను సైతం సీఎం సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నివేదికలను కంపెనీల చట్టం సెక్షన్ 395 ప్రకారం ఆయన సభకు సమర్పించనున్నారు.

శాసనసభ, శాసనమండలి ఉభయసభల సమావేశాలు ప్రారంభం కావడంతో అసెంబ్లీ ప్రాంగణంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. సమావేశాల వ్యవధి, సభలో చర్చించాల్సిన అంశాలు తదితర వ్యాపార కార్యక్రమాలపై తొలిరోజు స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Surya News
పేజీల కొద్దీ వార్తలు చదివే తీరిక లేదా?
అసలు విషయం ఏంటో 3 లైన్లలో ఫాస్ట్‌గా తెలుసుకోవాలంటే..
ఇప్పుడే మా WhatsApp ఛానల్‌లో జాయిన్ అవ్వండి! 🎯
Join

🔥 గత 24 గంటల్లో అత్యధికంగా చదివిన వార్తలు

ఇవి గత 24 గంటల్లో ఎక్కువ మంది చదివిన వార్తలు

📲 Join WhatsApp